కాకా కలేల్కర్
కాకా కలేల్కర్ (డిసెంబర్ 1, 1885 - ఆగస్టు 21, 1981) ఈయన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు, గాంధేయవాది.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈయన 1885 డిసెంబర్ 1 న మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన 1903 లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసాడు. ఈయన 1907 లో పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి తన బి.ఎను తత్వశాస్త్రంలో పూర్తిచేసాడు. ఈయన రాష్ట్రామత్ అనే జాతీయ మరాఠీ దినపత్రికలో కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత 1910 లో బరోడాలోని గంగానాథ్ విద్యాలయ అనే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈయన 1915 లో మహాత్మా గాంధీని మొదటిసారి కలిశాడు. ఆ తరువాత గాంధీ ప్రభావంతో సబర్మతి ఆశ్రమంలో సభ్యుడయ్యాడు. ఈయన సబర్మతి ఆశ్రమంలోని రాష్ట్ర షాలాలో బోధించాడు. ఈయన కొంతకాలం ఆశ్రమంలో నడిచే సర్వోదయ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం వల్ల చాలాసార్లు జైలు పాలయ్యాడు. ఈయన గాంధీ ప్రోత్సాహంతో అహ్మదాబాద్‌లో గుజరాత్ విద్యాపీట్ స్థాపించడంలో చురుకైన పాత్ర పోషించి 1928 నుండి 1935 వరకు వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేసి, 1939 లో గుజరాత్ విద్యాపిట్ కు పదవీ విరమణ చేశాడు. ఈయనను మహాత్మా గాంధీ సవాయి గుజరాతీ అని పిలిచేవాడు. ఈయన 1952 నుండి 1964 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. 1953 లో వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఈయన 1959 లో గుజరాతీ సాహిత్య పరిషత్కు అధ్యక్షత వహించాడు.[1]
పురస్కారాలు, గుర్తింపులు
[మార్చు]ఈయన 1965 లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయనకు 1971 లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌తో సత్కరించింది. భారత ప్రభుత్వం 1964 లో పద్మ విభూషణ్ ను పురస్కారంతో సత్కరించింది. ఈయన స్మారకార్థం 1985 లో స్మారక ముద్రను కూడా విడుదల చేసింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ name=agsi>Brahmabhatt, Prasad. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગાંધીયુગ અને અનુગાંધીયુગ (History of Modern Gujarati Literature:Gandhi Era and Post-Gandhi Era) (in గుజరాతి). Parshwa Publication. pp. 38–51.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;agsi
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Padma Awards: Year wise list of recipients (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 మే 2014. pp. 1, 3–6, 9, 11, 14, 17, 19–20, 23, 25, 29, 32–33, 37, 42, 48, 55, 59, 63, 66, 69–70, 72, 74, 83, 86, 88, 90–93, 95, 99–100, 105–106, 112, 114–115, 117–118, 121, 126, 131, 135, 139–140, 144, 149, 154–155, 160, 166, 172, 178, 183, 188. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 28 నవంబరు 2019.
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 గుజరాతి-language sources (gu)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1885 జననాలు
- 1981 మరణాలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు