Jump to content

1841

వికీపీడియా నుండి

1841 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1838 1839 1840 - 1841 - 1842 1843 1844
దశాబ్దాలు: 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
విలియం హెన్రీ హారిసన్
  • జనవరి 26: బ్రిటన్ హాంకాంగ్‌ను ఆక్రమించింది. ఇదే సంవత్సరంలో చేపట్టిన మొదటి జనాభా లెక్కల ప్రకారం ద్వీపంలో సుమారు 7,500 జనాభా ఉన్నట్లు నమోదైంది. [1]
  • జనవరి 27: అంటార్కిటికాలోని చురుకైన అగ్నిపర్వతం మౌంట్ ఎరేబస్‌ను కనుగొన్నారు., దీనికి జేమ్స్ క్లార్క్ రాస్ పేరు పెట్టారు. [2]
  • జనవరి 30: ప్యూర్టో రికోలోని మయాగెజ్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నగరం మూడింట రెండు వంతులు నాశనమైంది.
  • ఫిబ్రవరి 4: ఉత్తర అమెరికాలో గ్రౌండ్‌హాగ్ డే గురించి మొదటిసారిగా, జేమ్స్ మోరిస్ తన డైరీలో ప్రస్తావించాడు.
  • ఫిబ్రవరి 10: కెనడాలో యాక్ట్ ఆఫ్ యూనియన్ (బ్రిటిష్ నార్త్ అమెరికా చట్టం, 1840) ను ప్రకటించారు.
  • ఫిబ్రవరి 11 – కెనడా లోని యొక్క రెండు వలసలను విలీనం చేసి యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ కెనడాగా ఏర్పడ్డాయి.
  • ఫిబ్రవరి 18 – యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో కొనసాగుతున్న మొదటి ఫిలిబస్టర్ ప్రారంభమవుతుంది, మార్చి 11 వరకు ఉంటుంది.
  • ఫిబ్రవరిఎల్ సాల్వడార్ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
  • మార్చి 4 – విలియం హెన్రీ హారిసన్ అమెరికా తొమ్మిదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
  • ఏప్రిల్ 4 – అమెరికా అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ న్యుమోనియాతో మరణించాడు. అతడు పదవిలో మరణించిన మొదటి అధ్యక్షుడు. పదవి చేపట్టిన నెలలోపే మరణించాడు.
  • ఏప్రిల్ 6 – అమెరికా అధ్యక్షుడుగా ఉపాధ్యక్షుడు జాన్ టైలర్ ప్రమాణ స్వీకారం చేశాడు.
  • మే – చైనా-సిక్కు యుద్ధం ప్రారంభమైంది.
  • మే 3న్యూజిలాండ్ బ్రిటిష్ వలసగా మారింది. [3]
  • మే 22 – 1841 గురియాలో తిరుగుబాటు: జార్జియా ప్రావిన్స్ గురియా రష్యన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది.
  • జూన్ 6 – యునైటెడ్ కింగ్‌డమ్ సెన్సస్ జరిగింది. ఇంటి సభ్యుల పేర్లు, సుమారు వయస్సులను రికార్డ్ చేసిన మొదటిసర్వే అది.
  • జూలై 5థామస్ కుక్ తన మొదటి రైల్వే విహారయాత్రను ఇంగ్లాండ్‌లో ఏర్పాటు చేశాడు. [4]
  • జూలై 17 – హాస్య పత్రిక పంచ్ మొదటి ఎడిషన్ లండన్‌లో వెలువడింది. [5]
  • జూలై 18: కలకత్తా ఆరవ బిషప్ డేనియల్ విల్సన్, డాక్టర్ జేమ్స్ టేలర్, కలిసి ఢాకా కాలేజ్ స్థాపించారు.
  • సెప్టెంబర్ 24 – సారావాక్ బ్రూనై నుండి విడిపోయి, యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రక్షిత ప్రాంతంగా మారింది; జేమ్స్ బ్రూక్ రాజాగా నియమితుడయ్యాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

తేదీ వివరాలు తెలియనివి

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Thomson, John (1873). "Hong-Kong". Illustrations of China and Its People. Vol. 1. London.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. Ross, Voyage to the Southern Seas, 1, pp. 216–8.
  3. Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
  4. Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
  5. Spielmann, Marion Harry (1895). The History of "Punch". p. 27.